ఎండ తీవ్రత తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

ABN , First Publish Date - 2022-04-28T21:58:34+05:30 IST

మిట్టమధ్యాహ్నం ఎండ తీవ్రత బాగా ఉంటోంది. కూలర్లు, ఫ్యాన్లు తిరుగుతున్నా వేడి మాత్రం తగ్గడం లేదు. అలాంటప్పుడు ఇదిగో... ఈ టిప్స్‌ని ఫాలో అయిపోండి. ఇంటి వాతావరణాన్ని చల్లగా చేసుకోండి. ఏం చేయాలంటే...

ఎండ తీవ్రత తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!

ఆంధ్రజ్యోతి(28-04-2022)

మిట్టమధ్యాహ్నం ఎండ తీవ్రత బాగా ఉంటోంది. కూలర్లు, ఫ్యాన్లు తిరుగుతున్నా వేడి మాత్రం తగ్గడం లేదు. అలాంటప్పుడు ఇదిగో... ఈ టిప్స్‌ని ఫాలో అయిపోండి. ఇంటి వాతావరణాన్ని చల్లగా చేసుకోండి. ఏం చేయాలంటే...


పచ్చదనం ఉన్న చోట చల్లదనం ఉంటుంది. కాబట్టి ఇంట్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా కిటికీల దగ్గర కుండీల్లో మొక్కలు పెంచుకోవాలి. ఇంటి రూఫ్‌కి తెల్లటి పెయింటింగ్‌ వేయాలి. మార్కెట్లో ప్రస్తుతం వేడిని నిరోధించే రంగులు లభ్యమముతున్నాయి. వాటిని రూఫ్‌కి వేసుకుంటే వేడి తీవ్రత చాలా వరకు  తగ్గుతుంది. గోడలకు సున్నం లేదా తెలుపురంగు పెయింటింగ్‌ ఉంటే వేడి అధికంగా లోపలికి రాదు. ఇంట్లో టీవీ, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలు వేడిని ఉత్పత్తి కాబట్టి వాటిని ఆఫ్‌ చేయడం మరువద్దు. ముఖ్యంగా ఇంట్లో ఎల్‌ఈడీ లైట్స్‌ ఉంటే వేడి తక్కువ పుడుతుంది. పగటిపూట లైట్లను ఆర్పివేయడమే మంచిది. చల్లటి  నీళ్ల కోసం, మంచు ముక్కల కోసం పదే పదే ఫ్రిజ్‌ను తీస్తుంటే మంచిది కాదు. అలా చేస్తే వేడి జనిస్తుంది.దుప్పట్లు, దిండు కవర్లు, బెడ్‌షీట్స్‌ ఫ్యాన్సీ లేదా సిల్క్స్‌ వాడినా వేడిగా ఉంటుంది. అందుకే కాటన్‌వి ఎంచుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరించడం వల్ల కూడా ఉపశమనంగా ఉంటుంది.ఉదయం పూట ఇంట్లోని డోర్లు, కిటికీలను తెరవాలి.


అలానే సూర్యస్తమయం సమయంలో కూడా డోర్లు, కిటికీలు తెరవటం వల్ల బయటిగాలి లోపలికి వస్తుంది. లోపలిగాలి బయటకు పోయి బ్యాలెన్స్‌ అవుతుంది. కిటికీ కర్టెన్లు, డోర్‌ కర్టెన్లపై నీటిని స్ర్పే చేయటం వల్ల కూడా వాతావరణం కాస్త కూల్‌ అవుతుంది.ఫ్యాన్‌తో ఇంట్లో త్వరగా వేడిగాలి పుడుతుంది. అందుకే టేబుల్‌ ఫ్యాన్‌ లేదా కూలర్‌ను కిటికీ దగ్గర ఉంచాలి. కిటికీ తెరవటం వల్ల లోపల మనం వదిలిన వేడిగాలి బయటకు పోతుంది. టేబుల్‌ ఫ్యాన్‌ ముందు బౌల్‌లో ఐస్‌ముక్కలు ఉంచితే వాతావరణం కూల్‌ అవుతుంది.

Updated Date - 2022-04-28T21:58:34+05:30 IST