పాలకూర పెరగడం లేదు.. ఎందుకు?

ABN , First Publish Date - 2021-04-19T05:30:00+05:30 IST

ఎప్పుడైనా పాలకూర ఎంత చిక్కగా చల్లుకుంటే అంత ఎక్కువ ఎత్తు వస్తుంది. కోకోపీట్‌ వేయకుండా పాలకూర, కొత్తిమీర, కరివేప, పుదీనా వంటి మొక్కలను పెంచలేం...

పాలకూర పెరగడం లేదు.. ఎందుకు?

  1. ఎప్పుడైనా పాలకూర ఎంత చిక్కగా చల్లుకుంటే అంత ఎక్కువ ఎత్తు వస్తుంది. కోకోపీట్‌ వేయకుండా పాలకూర, కొత్తిమీర, కరివేప, పుదీనా వంటి మొక్కలను పెంచలేం. కోకోపీట్‌ ఉంటేనే వేళ్లు సులువుగా కిందకు వెళతాయి. దిగుబడి కూడా బాగా వస్తుంది. 
  2. రీసైక్లింగ్‌ ప్రాసె్‌సలో మెంతులు, ధనియాలు, పుదీనా, పాలకూర, తోటకూర, గోంగూరలను దీర్ఘచతురస్రాకారంలో ఉన్న బ్యాగ్స్‌లో పెంచాలి. 14 ఇంచుల వెడల్పు, 16 ఇంచుల లోతున్న 3 ఫీట్ల బ్యాగు దొరుకుతుంది. వీటిలో 36 అంటే మూడు వరుసల్లో వేసుకోవచ్చు. ధనియాలు ఒకవైపు పోసుకోగానే రెండో వైపున వారంలో మొలక వస్తుంది.  
  3. 18/18 కుండీలో ఆరు టొమాటో మొక్కలు మాత్రమే నాటాలి. ఇలాచేస్తే మొక్కలు వాలిపోవు. మధ్యలో ఒక కర్ర ఏర్పాటు చేసి ఆరు టొమాటో మొక్కలు పెంచితే ఒక కుండి నుంచి మొదటిసారి కనీసం కిలోన్నర టొమాటోలు వస్తాయి. టొమాటో గింజలను నేరుగా కుండీలో వేయొద్దు. ప్లగ్‌ట్రేలు, సీడ్‌లింగ్స్‌ ట్రేలు దొరకుతాయి. 10 నుంచి 12 రూపాయలు ఉండే వీటిలో వంద టొమాటో నారు మొక్కలు వేసుకోవచ్చు. 
  4. వంకాయ, బెండలను కూడా ముందుగా ప్లగ్‌ట్రేలలో పెంచాలి. అలాకాకుండా నేరుగా కుండీల్లో నాటితే అనుకున్నంతగా పెరగవు. కుండీలో, బ్యాగులో వేసిన మట్టిని 40 రోజుల తరువాత ప్రతి కుండీలో 3 ఇంచుల వరకు మల్చింగ్‌ చేయాలి.  
  5. వంకాయ గింజలను విత్తిన 40 రోజుల తరువాత మొక్క పై కొమ్మలను కత్తిరించాలి. మొక్కకు పెరిగే అవకాశం ఇవ్వకూడదు. దాంతో వంకాయలు గుండ్రంగా, చక్కని ఆకారంలో వస్తాయి. వంకాయ మొక్కలు ఎంత ఎండలో ఉంటే అంత మంచిది. చీడ రాదు.
  6. దొండకు కూడా దీర్ఘచతురస్రాకార కుండీలు తీసుకోవాలి. దొండను ఒకటే తీగతో పారించలేం. స్కేలింగ్‌ పద్ధతిలో మూడు ఇంచులకు ఒక విత్తనం చొప్పున నాటితే నాలుగు తీగలు ఒకే దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు ఎక్స్‌ ఆకారంలో వెదురు బొంగులు ఏర్పాటు చేసి గోడ దగ్గర పెట్టాలి. మెష్‌ చుడితే ఆ మెష్‌ చుట్టూ దొండ తీగ వచ్చేస్తుంది. దొండ తీగ తొందరగా, పొడవుగా పెరగడానికి ప్రతి రెండు వారాలకు ఒకసారి నీమ్‌కేక్‌ వేయాలి. సాయంత్రం ఆరు గంటల తరువాత నీమ్‌ కేక్‌ను మట్టిలో వేసి మల్చింగ్‌ చేయాలి. 

- కె.పి.రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌ డిజైనర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌, ఫోన్‌ : 8019411199


Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST