నాజూకుగా కనిపించేందుకు!

ABN , First Publish Date - 2020-12-13T06:15:21+05:30 IST

చీరకట్టులో మురిసిపోవాలనుకుంటారు అమ్మాయిలు. అయితే కొంచెం లావుగా ఉన్నవారు చీరలో ఎలా కనిపిస్తామో అనే సందేహంతో ఆగిపోతారు. అలాంటి వారు చీరలో సన్నగా కనిపించేందుకు ఏం చేయాలంటే...

నాజూకుగా కనిపించేందుకు!

చీరకట్టులో మురిసిపోవాలనుకుంటారు అమ్మాయిలు. అయితే కొంచెం లావుగా ఉన్నవారు చీరలో ఎలా కనిపిస్తామో అనే సందేహంతో ఆగిపోతారు. అలాంటి వారు చీరలో సన్నగా కనిపించేందుకు ఏం చేయాలంటే...

ప్రింటెడ్‌ సారీ: ఈ చీర కట్టుకుంటే అందరి దృష్టి చీర మీది ప్రింట్‌లు, వాటి డిజైన్‌ల మీదే ఉంటుంది. మీరు లావుగా ఉన్నారనేది ఎవరూ అంతగా గమనించరు. ప్రింటెడ్‌ సారీలోని మ్యాజిక్‌ ఇది.

టూ కలర్‌ సారీ: లావుగా ఉన్నవారు రెండు భిన్నమైన రంగులు మేళవించి ఉన్న చీర కట్టుకుంటే నాజూకుగా కనిపిస్తారు.

చిన్న అంచు: పెద్ద అంచులు ఉన్న చీరకన్నా చిన్న బార్డర్‌ ఉన్న చీరలు ఎంచుకోవాలి. దాంతో సన్నగా కనిపిస్తారు.

హీల్స్‌: చీర కట్టుకున్నప్పుడు ఫ్లాట్స్‌ బదులు హీల్స్‌ వేసుకోవాలి. పొడవుగా ఉన్నా సరే హీల్స్‌ ఎంచుకుంటే మీరు లావుగా ఉన్నారని ఎవరూ కనిపెట్టలేరు.

లాంగ్‌ బ్లౌజ్‌: పొడవైన జాకెట్‌ ధరిస్తే లావుగా కనిపించరు. లెహెంగా సారీ కూడా మంచి ఎంపిక.

Updated Date - 2020-12-13T06:15:21+05:30 IST