తిరంగా.. రెపరెపలు

Published: Wed, 10 Aug 2022 00:55:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరంగా.. రెపరెపలుచౌటుప్పల్‌ మండలంలో తిరంగా జెండాలతో సంజయ్‌, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు

ఉత్సాహంగా మొదలైన వజ్రోత్సవాలు 

సమరయోధుల త్యాగాలు కీర్తిస్తూ కార్యక్రమాలు

ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగిరేలా అధికారుల చర్యలు

నల్లగొండ జిల్లాకేంద్రంలో ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి 

5 కిలోమీటర్లు బండి సంజయ్‌ తిరంగ యాత్ర


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ):  స్వాతంత్య్ర ఉద్యమంలో నాయకుల పాత్ర. వారి వీరోచిత పోరాటం, చేసిన త్యా గాలను ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సం దర్భంగా స్వాతంత్య్ర వ జ్రోత్సవాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా 13 రోజులపాటు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. 


స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ఈ నెల 9 నుంచి 20వ తేదీవరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించే యోచనలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారతకీర్తిని విశ్వవ్యాప్తం చేసేలా ద్విసప్తాహ వేడుకలకు 13రోజుల షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల 6,7న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో సమావేశమై వేడుకల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగే ఈ వేడుకల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా అధికారుల ఆదేశాలమేరకు మండలస్థాయిలో అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 11న ఫ్రీడమ్‌ రన్‌లో పాల్గొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10లక్షల జెండాలు అవసరం కాగా, ఇప్పటివరకు 2లక్షల జెండాలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పటికే ఆయా మునిసిపాలిటీల వారీగా పంపిణీ చేసినట్లు చేనేత జౌళి అధికారులు వెల్లడించారు. 


మువ్వన్నెల రెపరెపలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ఘర్‌ తిరంగా పేరు తో ప్రజాసంగ్రామయాత్రలో జాతీయ జెండాను చేతబూని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యాత్ర కొనసాగించారు. ఆయనతోపా టు కార్యకర్తలు పెద్దసంఖ్యలో మువ్వన్నెల జెండాలతో నడిచారు. మునుగోడు నియోజకవర్గంలోని తాళ్లసింగారం నుంచి లింగోజీగూ డెం వరకు ఐదు కిలోమీటర్ల పొడవునా తిరంగయాత్ర కొనసాగింది. 


 గాంధీ సినిమా ప్రదర్శన 

వజ్రోత్సవాల సదర్భంగా ఈ నెల 9 నుంచి 15వరకు ఉమ్మడి  నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6నుంచి 10వరకు చదువుకునే విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆయా ప్రాంతాల్లోన్ని అన్ని సినిమా థియేటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు గాంధీ సినిమాను ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. 


ఉద్యమ స్ఫూర్తిని వర్తమానానికి అందించాలి

ఉద్యమాలన్నింటిలో కఠినమైనది ఏదైనా ఉందంటే అది అహింసాయుత ఉద్యమమే. అది మహాత్మాగాంధీ ఎంచుకున్న మార్గం. అలాంటి మహత్తర ఉద్యమ స్ఫూర్తిని వర్తమానానికి అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. వేడుకలను పురస్కరించుకొని నల్లగొండలో మంతి మాట్లాడారు. రాజాపేట మండలం రేణికుంటలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. సూర్యాపేటలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. 


వేడుకల షెడ్యూల్‌ ఇలా

మొదటి రోజు త్రివర్ణ పతాకాల పంపిణీ

వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో మంగళవారం తొలిరోజు అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ జాతీయజెండాలు పంపిణీ చేశారు. 

10న వన మహోత్సవం : పల్లెపల్లెన మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతీ గ్రామం, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కుల్లో 75 అనే సంఖ్య వచ్చేలా మొక్కలు నాటుతారు.

11న ఫ్రీడమ్‌ రన్‌: అంతటా జాతీయ జెండాలతో విద్యార్థులు, పట్టణ ప్రముఖులతో ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహిస్తారు. జిల్లా ఎస్పీలు తమ సిబ్బందితో ఈరన్‌లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

12న జాతీయ సమైక్యతా రక్షా బంధన్‌: మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవాలను ప్రసారం చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. స్వాతంత్రోద్యమ ఘట్టాలు, సమరయోధుల జీవిత విశేషాలను ప్రసారం చేస్తారు. 

13న ర్యాలీలు బెలూన్ల ఎగురవేత: యువత, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స కేడెట్లు, విద్యార్థులు ప్లకార్డులతో గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు. మైదానాల్లో సమావేశాలు నిర్వహించి మూడు రంగుల బెలూన్లు ఎగురవేస్తారు. 

14న జానపద కళాకారుల ప్రదర్శనలు: ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక సాంస్కృతిక జానపద కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా బాణాసంచా కూడా జిల్లాకేంద్రాల్లో కాల్చనున్నారు.తెలంగాణ సాంస్కుృతిక సారధి నాయకత్వం వహించనుంది.

15న స్వాతంత్య్ర వేడుకలు : స్వాతంత్య్ర దినోత్సవాన్నిఘ నం గా నిర్వహిస్తారు.అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 

16న జాతీయగీతం సామూహిక ఆలాపన: అన్ని గ్రామపంచాయతీలు, పట్టణాలు, స్థానిక సంస్థల్లో ఏకకాలంలో సామూహికం గా జాతీయ గీతం ఆలపిస్తారు. అదేరోజు కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తారు.

17న రక్తదాన శిబిరాలు: అన్ని జిల్లా కేంద్రాల్లో వైద్యశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయతో 75మంది దాతలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 

18న ఉద్యోగులు, యువతకు క్రీడా పోటీలు: ఫ్రీడమ్‌ కప్‌ ఉద్యోగులు, యువతకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. జిల్లాకేంద్రలో కలెక్టర్‌, ఎస్పీ 11జట్ల ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా మండలస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహిస్తారు. 

19న అనాథాశ్రయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ: ప్రభుత్వాస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రయాలు, వివిధ జైళ్లలోని ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేస్తారు.

20న ముగ్గులపోటీ : వజ్రోత్సవాల చివరి రోజు అన్ని గ్రామపంచాయతీ, పట్ణణాల్లో స్యయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించనున్నారు. రంగోళీతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.