చిరిగిన జీన్స్‌పై మాజీ సీఎం తిరత్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-16T16:57:44+05:30 IST

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ యాదవ్ చిరిగిన జీన్స్‌పై తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

చిరిగిన జీన్స్‌పై మాజీ సీఎం తిరత్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ యాదవ్ చిరిగిన జీన్స్‌పై తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చిరిగిన జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతిలో భాగం కాదంటూ తీరత్ సింగ్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.చిరిగిన జీన్స్ ధరించే మహిళలపై తీరత్ సింగ్ వ్యాఖ్యలు చేసి గత ఏడాది తీవ్ర దుమారం రేపారు. ఈ అంశంపై తాను గతంలో చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నానని యాదవ్ చెప్పారు.2021వ సంవత్సరం మార్చిలో తీరత్ సింగ్ యాదవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత యువతులు వింత ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. చిరిగిన జీన్స్,బూట్లు ధరించి ఉన్న ఓ తల్లిని చూసి తాను షాక్ అయ్యానని సింగ్ పేర్కొన్నారు.


చిరిగిన జీన్స్ ధరించిన మహిళల వల్ల వారి పిల్లలు కూడా వారిని అనుసరిస్తారని, ఇంట్లో పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలని యాదవ్ కోరారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లతోపాటు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యాదవ్ చివరికి క్షమాపణలు చెప్పారు. కానీ అదే సమయంలో జీన్స్‌తో తనకు ఎటువంటి సమస్య లేదని, అయితే చిరిగిన జీన్స్ ధరించడం సరైనది కాదని యాదవ్ తన అభ్యంతరాన్ని పునరుద్ఘాటించాడు.అయితే యాదవ్ నాలుగు నెలల లోపే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  అతని స్థానంలో పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ సీఎంగా నియమించారు.


Updated Date - 2022-05-16T16:57:44+05:30 IST