వైభవంగా తిరుకల్యాణోత్సవం

ABN , First Publish Date - 2022-07-01T06:05:54+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో గురువారం వైభవంగా జరిగాయి.

వైభవంగా తిరుకల్యాణోత్సవం
నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూన్‌30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో గురువారం వైభవంగా జరిగాయి. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం నిర్వహించారు. అనంతరం దేవతల సేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో కల్యాణతంతు జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. ముందుగా ప్రభాతవేళ సుప్రభాతం, బిందెతీర్థంతో నిత్యారాధనలు ఆరంభించారు. గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి సహస్రనామాలతో అర్చనలు జరిపారు. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12, 16,987 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. తెలంగా ణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ యాదాద్రీశుడిని దర్శిం చుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గర్భాలయంలోని స్వయంభువులను దర్శిం చుకుని ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమెకు అర్చ కులు ఆశీర్వచనం జరపగా ఈవో గీతారెడ్డి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఆమె వెంట యాదాద్రిభువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఉన్నారు. యాదగిరివాసుడిని ఏపీ బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆశీర్వచనం జరపగా, దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఏపీ రా ష్ట్రం మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. 

Updated Date - 2022-07-01T06:05:54+05:30 IST