తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

ABN , First Publish Date - 2022-04-12T18:08:42+05:30 IST

తిరుమల శ్రీవారిని దర్శించకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తోపులాట జరిగింది. దీంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శన టోకేన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. టోకేన్లు లేకూండానే భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత వైకుంఠ క్యూ కాంప్లేక్స్‌లోని కంపార్టుమెంట్లలోకి భక్తులను  టీటీడీ అనుమతిస్తోంది. 2020 మార్చి 21వ తేది నుంచి భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించడాన్ని టీటీడీ నిలిపివేసింది. టోకేన్ పోందిన భక్తులను ముందుగా కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తున్న టీటీడీ... రెండు గంటల తరువాత టోకేన్ లేని భక్తులను కంపార్టుమెంట్లలోకి అనుమతించనుంది. 

Updated Date - 2022-04-12T18:08:42+05:30 IST