వైభవంగా మొదలైన శ్రీవారి వసంతోత్సవాలు

Published: Thu, 14 Apr 2022 20:57:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైభవంగా మొదలైన శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి సాలకట్ల వసంత్సోవాలు వైభవంగా మొదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయానికే పరిమితమైన ఈ ఉత్సవాలు ఈసారి భక్తుల నడుమ వసంతమండపంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తర్వాత ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవ సందర్భంగా వసంతమండపంలో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వర్ణరథోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.