
తిరుమల: టైం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులకు రెండో రోజుకు వేంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్య్టా భక్తులకు సర్శదర్శనానికి మరుసటిరోజుకు కాకుండా రెండోరోజుకు దర్శనం దొరుకుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శనం కల్పించే దిశగా మార్చి 29న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు 28వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు దీనికి అనుగుణంగా తిరుమల యాత్రకు ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి