Tirumala: రెండు కిలో మీటర్ల మేర భక్తులు. 30 గంటల సమయం.. ఇదీ పరిస్థితి?

ABN , First Publish Date - 2022-08-15T01:25:24+05:30 IST

తిరుమల కొండపై భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యూ‎లైన్‎లో...

Tirumala: రెండు కిలో మీటర్ల మేర భక్తులు. 30 గంటల సమయం.. ఇదీ పరిస్థితి?

తిరుపతి: తిరుమల (Tirumala) కొండపై భక్తులు (Devotees) తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్యూ‎లైన్‎లో గంటలపాటు వేచి ఉండాల్సిరావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ (TTD) సరైన ఏర్పాట్లు చేసి ఉంటే తమకీ పరిస్థితి ఉండేది కాదని భక్తులు వాపోతున్నారు. ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండిపోవడంతో లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా శ్రీవారి సేవా సదన్ (Srivari Seva Sadan) వద్ద క్యూలైన్ ఉంది. 


దీంతో స్వామి వారి దర్శనం కోసం దాదాపు 2 కిలో మీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక శ్రీవారి ఉచిత దర్శనానికి 30 గంటల సమయం పడుతుంటే.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అయితే ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలి నడక వచ్చిన వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయలేదని వాపోతున్నారు. పాత పద్ధతిలోనే శ్రీవారి దర్శనానికి అనుమతించాలని కోరుతున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ ఎక్కువగా ఉందని.. లాకర్ కూడా దొరకడం లేదని.. భోజన సదుపాయాలు కూడా సరిగా కల్పించడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-08-15T01:25:24+05:30 IST