TTD: రికార్టుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2022-09-02T01:37:20+05:30 IST

తిరుమల (Tirumala) వెంకన్న హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. జూలై నెలలో వచ్చిన రూ.139.46 కోట్లే

TTD: రికార్టుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల: తిరుమల (Tirumala) వెంకన్న హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. జూలై నెలలో వచ్చిన రూ.139.46 కోట్లే టీటీడీ (TTD) చరిత్రలో రికార్డు అనుకుంటే ఆగస్టు నెలలో ఏకంగా రూ.140.07 కోట్ల ఆదాయం సమకూరింది. స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పరిమితంగానే ఉన్నప్పటికీ హుండీ మాత్రం కానుకలతో కళకళలాడుతోంది. నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆగస్టు (August) నెలలో మొత్తం 22.80 లక్షలమంది శ్రీవారిని దర్శించుకున్నారు.14వ తేదీన 92,328 మంది, 15న 87,692మంది శ్రీవారిని దర్శించుకున్నారు.


హుండీ ఆదాయం అత్యధికంగా 17వ తేదీన 5.86 కోట్లు, 15న రూ.5.30, 10న రూ.5.15, 27న రూ.5.14, 1వ తేదీన రూ.5 కోట్లు లభించింది. 21 సార్లు హుండీ ఆదాయం రూ.4 కోట్లకు పైగా సమకూరింది.తిరుమల వెంకన్న హుండీ ఆదాయం మార్చి నుంచి వరుసగా మరోసారి వంద కోట్ల ఆదాయాన్ని గడించింది. మార్చినెల్లో 19.72 లక్షల మంది దర్శించుకోగా, వీరు సమర్పించిన కానుకల ద్వారా రూ.128.61 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. ఇకా, ఏప్రిల్‌ నెలలో 20.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, వీరి ద్వారా రూ.127.63 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది. అలాగే మే నెల్లో 22.68 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా వీరి ద్వారా రూ.130.29 కోట్లు లభించింది. అలాగే జూన్‌ నెలలో 23.23 లక్షల మంది భక్తులకు దర్శించుకుని రూ.123.74 కోట్లు కానుకలు సమర్పించారు. 

Updated Date - 2022-09-02T01:37:20+05:30 IST