12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

ABN , First Publish Date - 2022-07-10T01:54:25+05:30 IST

ఈనెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో 12వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల: ఈనెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో 12వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో 11వ తేదీన వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని కోరింది. 


మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఈ మేరకు న్యాయమూర్తికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అంద జేశారు. 

Updated Date - 2022-07-10T01:54:25+05:30 IST