Srivari Brahmotsavam: టీటీడీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-28T19:24:33+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేఫథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Srivari Brahmotsavam: టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేఫథ్యంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఇవ్వనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు కేవలం సర్వదర్శనం గుండానే శ్రీవారీ దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతించనుంది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణం జరుగనుంది. సెప్టెంబర్‌ 27న  సీఎం జగన్‌ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్‌ 1న గరుడ వాహన సేవ, 5న చక్రస్నానం కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-07-28T19:24:33+05:30 IST