TTD: తిరుమల భక్తులకు విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-08-10T03:23:32+05:30 IST

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల (Tirumala) పర్యటన వాయిదా వేసుకోవాలని టీటీడీ (Ttd) విజ్ఞప్తి చేసింది. వృద్ధులు..

TTD: తిరుమల భక్తులకు విజ్ఞప్తి

తిరుమల (Tirumala): వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల (Tirumala) పర్యటన వాయిదా వేసుకోవాలని భక్తులకు టీటీడీ (Ttd) విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, వికలాంగులు, చిన్నారుల తల్లిదండ్రులు పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. దీంతో తిరుమల కొండకు భక్తుల రద్దీ భారీగా పెరుగుతుందని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భ‌క్తులు (Devotees) ప్రణాళికబ‌ద్ధంగా దర్శనం, వసతి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-08-10T03:23:32+05:30 IST