Tirumalaలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-16T01:04:35+05:30 IST

తిరుమల (Tirumala)లో వారంతపు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం నుంచే కొండకు భక్తుల రాక పెరిగింది.

Tirumalaలో భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల (Tirumala)లో వారంతపు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం నుంచే కొండకు భక్తుల రాక పెరిగింది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌ లేపాక్షి సర్కిల్‌ మీదుగా లగేజీ సెంటర్‌ వరకు చేరింది. దీంతో సర్వదర్శనం భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు దర్శన సమయం పడుతోంది. శ్రీవారి మాడ వీధులు, అఖిలాండంతోపాటు కాటేజీలు, బస్టాండ్‌, అన్నదాన భవన పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ నెలకొనడంతో గదులకు డిమాండ్‌ పెరిగింది. చాలామంది గదులు లభించక ఇబ్బంది పడ్డారు. సోమవారం మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ (TTD) అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-05-16T01:04:35+05:30 IST