సీతారాములకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

ABN , First Publish Date - 2022-04-11T01:40:09+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా సీతారామలక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని

సీతారాములకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా సీతారామలక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలిపి, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తర్వాత రంగనాయక మండపంలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషస్త్రక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, ఈవో జవహర్‌రెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-11T01:40:09+05:30 IST