
తిరుపతి (Tirupathi): తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్ (Jagan)కు చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు (Old women) ఎర్రటి ఎండలో నాలుగు గంటలపాటు నిరీక్షించింది. అధికారులు కనికరం చూపకపోవడంతో బాధతో ఆ వృద్ధురాలు ఇంటి బాట పట్టింది. తిరుపతి జిల్లా పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధిరాలి పేరు చెంగమ్మ. తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, కాంబాకం పంచాయతీకి చెందిన నిరుపేద దళితురాలు. ఆమె పేరిట 2.94 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఇటీవల కొందరు ఆక్రమించి ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకున్నారు. దీనిపై చెంగమ్మ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అర్జీ ఇవ్వాలనుకుంది.
సీఎం జగన్ వస్తున్న విషయం తెలుసుకుని శ్రీకాళహస్తి మండలం, ఇనగళూరుకు చేరుకుంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని అధికారులను వేడుకుంది. అయినా వారు కనికరం చూపించలేదు. వయసు మీదపడినా.. ఎలాగోలా హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుంది. ఉదయం 10 గంటల నుంచి సీఎం తిరిగి వెళ్లేవరకు ఎండలో కూర్చుంది. చివరికి అర్జీ ఇచ్చే అవకాశం రాకపోవడంతో కంటతడి పెట్టుకుంటూ ఇంటికి పయనమైంది.
ఇవి కూడా చదవండి