మేజర్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తిరుపతి

ABN , First Publish Date - 2022-07-03T06:40:27+05:30 IST

దేశంలోనే తిరుపతి మేజర్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుతోందంటూ డీఆర్డీవో ఛైర్మన్‌ జి.సతీ్‌షరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

మేజర్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తిరుపతి
సతీ్‌షరెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న ప్రొఫెసర్‌ నారాయణరావు

డీఆర్డీవో ఛైర్మన్‌ సతీ్‌షరెడ్డి


తిరుపతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తిరుపతి మేజర్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుతోందంటూ డీఆర్డీవో ఛైర్మన్‌ జి.సతీ్‌షరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం తిరుపతిలోని ఫార్చ్యూన్‌ కెన్సెస్‌ హోటల్‌లో తిరుపతి ఇన్నోవేటివ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ చిన్న పట్టణమైన తిరుపతిలో ఉన్నత విద్యా సంస్థలు ఇన్ని వుండడం దేశంలో మరెక్కడా కనిపించదన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును తిరుపతి ప్రాంత ఉన్నత విద్యా సంస్థలు అందుకోవాలని కోరారు. తిరుపతిలోని ఉన్నత విద్యాసంస్థలు చేతులు కలపాలని, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల దిశగా తిరుపతి శైలి అనేది కనిపించాలని పిలుపునిచ్చారు. యువ పరిశోధకులు, విద్యార్థులు చేపట్టే నూతన ఆవిష్కరణలు కూడా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా వుండాలన్నారు. హైదరాబాదు తరహాలో తిరుపతి ప్రాంత ఉన్నత విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎందుకు కృషి చేయకూడదంటూ ప్రశ్నించారు. ఆ దిశగా తిరుపతి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ కృషి చేయాలని కోరారు. ఉన్నత విద్యా సంస్థల అధిపతులు స్టీరింగ్‌ కమిటీగా ఏర్పడి నెలకు ఒకటి రెండు సార్లు క్రమం తప్పకుండా విద్యార్థులకు సెమినార్లు, లెక్చర్లు, ఫీల్డు ట్రిప్‌లు వంటివి నిర్వహించాలని సూచించారు. వారి నూతన ఆలోచనలను ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల దిశగా, అక్కడ నుంచీ పెట్టుబడులు, వస్తు ఉత్పత్తి దిశగా ప్రోత్సహించి సహకరించాలని సూచించారు. కొన్ని అంశాలపై తిరుపతి ఐఐటీతో కలసి పనిచేస్తామని  సతీ్‌షరెడ్డి ప్రకటించారు.తిరుపతి ఇన్నేవేటివ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ నారాయణరావు, ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఐఐఎ్‌సఈఆర్‌ డైరెక్టర్‌ గణేష్‌, గాదంకి రాడార్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ ఏకే పాత్ర, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి, పద్మావతీ వర్శిటీ వీసీ జమున, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, మోహన్‌బాబు వర్శిటీ వీసీ నాగరాజన్‌  తదితరులతో పాటు పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:40:27+05:30 IST