Tirupati డైలీ ఎక్స్‌ప్రెస్‌ పాక్షికంగా రద్దు

ABN , First Publish Date - 2022-02-23T16:11:49+05:30 IST

విల్లుపురం - కాట్పాడి సెక్షన్‌లో కనియంబాడి - వేలూరు కంటోన్మెంట్‌ స్టేషన్ల మధ్య లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ నంబరు 122 వద్ద సబ్‌ వే నిర్మాణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే తిరుపతి డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా

Tirupati డైలీ ఎక్స్‌ప్రెస్‌ పాక్షికంగా రద్దు

అడయార్‌(చెన్నై): విల్లుపురం - కాట్పాడి సెక్షన్‌లో కనియంబాడి - వేలూరు కంటోన్మెంట్‌ స్టేషన్ల మధ్య లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ నంబరు 122 వద్ద సబ్‌ వే నిర్మాణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే తిరుపతి డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నంబరు 16854 విల్లుపురం జంక్షన్‌ - తిరుపతి డైలీ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ ప్రకారం విల్లుపురం జంక్షన్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలును ఈ నెల 24వ తేదీ విల్లుపురం జంక్షన్‌ - వేలూరు కంటోన్మెంట్‌ స్టేషన్ల మధ్య పాక్షిరంగా రద్దు చేశారు. 24వ తేదీ బుధవారం విల్లుపురం జంక్షన్‌లో కాకుండా, వేలూరు కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 8.20 గంటలకు తిరుపతికి బయలు దేరి వెళుతుందని అందులో పేర్కొన్నారు.


Updated Date - 2022-02-23T16:11:49+05:30 IST