Tirupati వరకు నైరుతి రుతుపవనాలు

ABN , First Publish Date - 2022-06-14T02:37:45+05:30 IST

వారం రోజులు ఆలస్యంగా సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అరేబియా సముద్రం,

Tirupati వరకు నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: వారం రోజులు ఆలస్యంగా సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అరేబియా సముద్రం, గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, మరట్వాడ, కర్ణాటక, తమిళనాడులో అనేక ప్రాంతాలతోపాటు రాయలసీమలో తిరుపతి వరకు, ఇంకా తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, విదర్భ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల్లో అంటే ఈనెల 17కల్లా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది మే 29కల్లా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తరువాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంలో జాప్యం జరిగింది. సాధారణంగా జూన్‌ నాలుగో తేదీకల్లా రాయలసీమ, ఎనిమిదికల్లా దక్షిణ కోస్తాలోని ఒంగోలు, 11వ తేదీ నాటికి విశాఖపట్నం రుతుపవనాలు రావలసి ఉంది. అయితే రుతుపవనాల పురోగతిలో వేగం లోపించడంతో రాష్ట్రంలోకి రావడం ఆలస్యమైంది. సోమవారం నాటికి తిరుపతి వరకు రుతుపవనాలు విస్తరించినా...దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం తప్ప మిగిలినచోట్ల వర్షాలు లేవు. రుతుపవనాలు సాధారణ తేదీ కంటే మూడు రోజులు ముందుగా కేరళలో ప్రవేశించినా రుతుపవన కరెంట్‌ పుంజుకోలేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-06-14T02:37:45+05:30 IST