నాదనీరాజన మండప పునఃనిర్మాణంలో ట్విస్ట్

ABN , First Publish Date - 2022-02-19T21:54:15+05:30 IST

నాదనీరాజన మండప పునఃనిర్మాణంలో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఎదుట తాత్కాలికంగా 100/60 అడుగుల ప్రదేశంలో నాదనీరాజన మండపం ఏర్పాటు చేశారు.

నాదనీరాజన మండప పునఃనిర్మాణంలో ట్విస్ట్

తిరుమల: నాదనీరాజన మండప పునఃనిర్మాణంలో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఎదుట తాత్కాలికంగా 100/60 అడుగుల ప్రదేశంలో నాదనీరాజన మండపం ఏర్పాటు చేశారు. మండపంలో నిత్యం సాంస్కృతిక, వేదపారాయణం కార్యక్రమాలు టీటీడీ నిర్వహిస్తోంది. మండపాన్ని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని పాలకమండలి తీర్మానం చేసింది. గతంలో తొలగించిన వెయ్యికాళ్ల మండపం తరహాలో నాదనీరాజన మండపం నిర్మించాలని ప్రతిపాదించారు. శ్రీవారి ఆలయం ఎదుట శాశ్వత నిర్మాణాలు చేయొద్దంటూ.. గతంలో భద్రతా కమిటీ నివేదిక ఇచ్చింది. భద్రతా కమిటీ సూచనలు పక్కనపెట్టి నిర్మాణం చేపట్టడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-02-19T21:54:15+05:30 IST