Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

ABN , First Publish Date - 2021-08-07T17:23:16+05:30 IST

రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆక్సిజన్ అందకనే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఆక్సిజన్ సరఫరా...

Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

తిరుపతి : రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆక్సిజన్ అందకనే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని అఫిడవిట్‌లో తెలిపింది. ఐపీసీలోని 304 సెక్షన్ కింద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపింది. ఆక్సిజన్ అయిపోయిందని చెప్పాక కూడా సరఫరా చేయలేకపోయారని పేర్కొంది. 23 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని జగన్ సర్కార్ తెలిపింది. భారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ సప్లై లిమిటెడ్ కంపెనీపై.. కేసు నమోదు చేశామని అఫిడవిట్‌లో ప్రభుత్వం వివరించింది.

Updated Date - 2021-08-07T17:23:16+05:30 IST