సుప్రీంకోర్టు సీజే ఆవిష్కరించిన ‘తిరుపతి కథలు’

Jun 17 2021 @ 01:43AM

గ్రంథ రచయిత పేటశ్రీకి దక్కిన అరుదైన గౌరవం


తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూన్‌ 16: తిరుపతి రచయిత పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన ‘తిరుపతి కథలు’ పుస్తకాన్ని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మండలి బుద్ధప్రసాద్‌, కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయకుమార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1200 పేజీల ఈ గ్రంథాన్ని ఎమెస్కో సంస్థ ప్రచురించింది. తిరుపతి, తిరుమల పరిసరాల గురించిన ఆసక్తికరమైన అనేక విశేషాలను పేట శ్రీనివాసులురెడ్డి కథలుగా రాశారు. ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో సీరియల్‌గా వీటిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.