AP: తిరుపతిలో శ్రీవారి భక్తులకు కష్టాలు

Sep 25 2021 @ 08:43AM

తిరుపతి: శ్రీవారి టోకెన్స్ విషయంలో టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో తిరుపతిలో శ్రీవారి భక్తులకు కష్టాలు ఎదురవుతున్నాయి. భక్తులకు సమాచారం ఇవ్వకుండా శ్రీనివాసంలో టోకెన్స్ ఇవ్వటాన్ని టీటీడీ నిలిపివేసింది. ఈ రోజు ఆన్లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్స్ ఇస్తుండటంతో  తిరుపతిలోని ఇంటర్నెట్  సెంటర్స్ వద్ద వందలాదిగా  భక్తులు చేరుకుంటున్నారు. ఇంతమందికి టికెట్స్ బుక్ చేయలేమని నిర్వాహకులు షాప్స్ మూసివేశారు. టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.