తిరుపతి: నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం పరిశీలించారు. ఆరు డివిజన్లలో ఆరుగురికి తిరిగి నామినేషన్ వేసేందుకు ఎస్ఈసీ అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించామని చెప్పారు. స్వేచ్చాయుత వాతావరణంలో నామినేషన్ కేంద్రాలు ఉండేలా పోలీసు ప్రొటోక్షన్ ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలియజేశారు.