పార్లమెంట్ నుంచి టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయన్ సస్పెండ్

ABN , First Publish Date - 2021-12-22T01:57:25+05:30 IST

ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన మధ్యనే రెండు సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో సభ్యులకు ఎలాంటి నోటీసు లేకుండానే బిల్లు ప్రవేశపెట్టారని డెరెక్ ఆరోపించారు. పార్లమెంట్ రూల్ బుక్‌లోని అంశాలను ఊటంకిస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

పార్లమెంట్ నుంచి టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయన్ సస్పెండ్

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో నూతన ఎన్నికల చట్టానికి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్న సమయంలో చైర్మన్ కుర్చీ వైపు ఆయన పుస్తకం విసిరేశారన్న కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన సస్పెన్షన్ శీతకాల సమావేశాలు ముగిసే వరకు ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన మధ్యనే రెండు సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో సభ్యులకు ఎలాంటి నోటీసు లేకుండానే బిల్లు ప్రవేశపెట్టారని డెరెక్ ఆరోపించారు. పార్లమెంట్ రూల్ బుక్‌లోని అంశాలను ఊటంకిస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో రూల్ బుక్‌‌ని చైర్మెన్ కుర్చీ వైపు డేరెక్ ఆవేశంగా విసిరారని, అధి సెక్రెటరీ జనరల్ టేబుల్ వద్ద కూర్చున్న అధికారులకు తగిలిందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు. ఈ కారణంతోనే డేరెక్‌ను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-22T01:57:25+05:30 IST