TMC MP,సినీనటి నుస్రత్ జహాన్ MISSING

ABN , First Publish Date - 2022-05-18T13:58:17+05:30 IST

రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి, TMC MP నుస్రత్ జహాన్ MISSING అంటూ పోస్టర్లు వెలిశాయి...

TMC MP,సినీనటి నుస్రత్ జహాన్ MISSING

బసిర్‌హత్‌‌ నియోజకవర్గంలో పోస్టర్లు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): రాజకీయ నాయకురాలిగా మారిన సినీనటి, TMC MP నుస్రత్ జహాన్ MISSING అంటూ పోస్టర్లు వెలిశాయి. బసిర్‌హత్‌ లోక్‌సభ నియోజకవర్గ తృణమూల్‌ ఎంపీ నుస్రత్‌ పేరు మీద మిస్సింగ్‌ పోస్టర్లు కనిపించడంతో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది.బసిర్‌హట్‌ నియోజకవర్గంలోని చపటాలా, కీయాడంగా ప్రాంతాల్లో మిస్సింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లను టీఎంసీ కార్యకర్తలు మాత్రమే అంటించారని ప్రతిపక్ష శిబిరం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ నేతలు ఖండించారు.తృణమూల్‌లోని ఒక వర్గం ఈ పోస్టర్లు ఎంపీపై నివాసితుల ఆగ్రహానికి వ్యక్తీకరణ అని పేర్కొంది. అయితే ఇది విపక్షాల పనేనని ఎంపీకి సన్నిహితులైన తృణమూల్ నాయకులు అంటున్నారు. 


‘‘ఏ సమస్యా లేనందునే ప్రతిపక్షాలు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎంపీ పాత్ర ఉందని, స్థానిక నాయకులతో కూడా ఎంపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు’’ అని టీఎంసీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.స్టార్ ఎంపీ నుస్రత్ గైర్హాజరు కావడంపై తృణమూల్‌లోని సందేశ్‌ఖాలీ, హింగల్‌గంజ్, హస్నాబాద్, బసిర్‌హత్ నార్త్, బసిర్‌హత్‌లోని సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక వర్గం కూడా ఆగ్రహంతో ఉంది. తృణమూల్ స్థానిక నాయకత్వంలోని ఒక వర్గం ఆమె ఒక తోకచుక్క అని ఆరోపించింది.‘‘ ప్రచార సమయంలో నుస్రత్ బసిర్‌హట్‌కు వస్తారు.


 కరోనా కాలంలో బసిర్‌హట్ ఎంపీ కనిపించలేదు. గతేడాది అంఫాన్ తుపాను సమయంలో కూడా ఎంపీ రాలేదని కొందరు ఆరోపించారు. అయితే దీనిపై నటి నుస్రత్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.ఎంపీ నుస్రత్ తన నియోజకవర్గం నుంచి తప్పిపోయి ఉండవచ్చు కానీ, ఆమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. కొన్ని గంటల క్రితం నుస్రత్ తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Updated Date - 2022-05-18T13:58:17+05:30 IST