బీజేపీ ఆ పని చేస్తే వ్యతిరేకిస్తాం: మమత

Published: Sun, 27 Mar 2022 19:12:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ ఆ పని చేస్తే వ్యతిరేకిస్తాం: మమత

బీర్భూమ్ హింసాకాండపై జరుగుతున్న సీబీఐ విచారణను బీజేపీ ప్రభావితం చేయాలనుకుంటే తాము తీవ్రంగా వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ కేసు విచారణను బీజేపీ ప్రభావితం చేయాలనుకుంటోందని, ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉందని మమత అన్నారు. ఆదివారం బెంగాల్‌లోని బగ్దోగ్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడం మంచి చర్యే. అయితే.. విచారణ బీజేపీ సూచనల ప్రకారమే జరిగితే మాత్రం వ్యతిరేకిస్తాం’’ అని ఆమె అన్నారు. ‘‘గతంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణల్లో న్యాయం జరగలేదు. బాధితులకు న్యాయం చేయడంలో సీబీఐ ఫెయిలైంది. దీని బదులు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించడమే మంచిది’’ అని మమత అభిప్రాయపడ్డారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.