టీఎంసీ కార్యకర్తపై కాల్పులు... బాంబు దాడిలో ముగ్గురికి గాయాలు!

ABN , First Publish Date - 2021-02-24T11:51:34+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ పరిధిలోని...

టీఎంసీ కార్యకర్తపై కాల్పులు... బాంబు దాడిలో ముగ్గురికి గాయాలు!

మిడ్నాపూర్: పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ పరిధిలోని మకర్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలపై దాడి జరిగింది. మంగళవారం రాత్రి 10 గంటలకు తుపాకీ కాల్పులతో పాటు బాంబు దాడి చోటుచేసుకుంది. దీంతో ఈ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. తుపాకీ తూటాలకు ఒక టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. 


బాంబు దాడిలో మరో ముగ్గురు కార్యర్తలు గాయపడ్డారు. బాధితులను మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అజీత్ మౌతీ స్పందిస్తూ టీఎంసీ కార్యకర్తల్లోని రెండు గ్రూపుల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నదని పేర్కొన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం టీఎంసీకి చెందిన నలుగురు కార్యకర్తలు రోడ్డు పక్కగా కూర్చున్నారు. ఇదే సమయంలో ఫైరింగ్ జరగడంతో పాటు బాంబు దాడి కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. తుపాకీ తూటాలకు టీఎంసీ కార్యకర్త సైవిక్ దలాయీ(28) మృతి చెందాడు.

Updated Date - 2021-02-24T11:51:34+05:30 IST