ఈసీ నిషేధ ఉత్తర్వులు బేఖాతర్...TMC కార్యకర్తల విజయోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T17:29:34+05:30 IST

ఉప ఎన్నికల పర్వంలో విజయం సాధించినా విజయోత్సవాలు చేయరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినా టీఎంసీ కార్యకర్తలు దాన్ని ఉల్లంఘించారు....

ఈసీ నిషేధ ఉత్తర్వులు బేఖాతర్...TMC కార్యకర్తల విజయోత్సవం

కోల్‌కతా : ఉప ఎన్నికల పర్వంలో విజయం సాధించినా విజయోత్సవాలు చేయరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినా టీఎంసీ కార్యకర్తలు దాన్ని ఉల్లంఘించారు. విజయోత్సవాలు చేయరాదని ఈసీ జారీ చేసిన ఆదేశాలను టీఎంసీ కార్యకర్తలు బేఖాతరు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఎంసీ అభ్యర్థులే విజయం దిశగా పయనిస్తున్నారు. గోసాబా, దిన్హాటా, ఖర్దాహ్తోపాటు 4 స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 


తమ సమీప బీజేపీ అభ్యర్థుల కంటే అత్యధిక మెజారిటీ ఓట్లు సాధించి ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో కూచ్ బెహార్ లోని దిన్ హటాలోని కౌంటింగ్ కేంద్రం వద్ద టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దిన్ హటాలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా 96,537 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం ముందే నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.


Updated Date - 2021-11-02T17:29:34+05:30 IST