టీఎంసీ యువ నేత సాయని ఘోష్‌కి బెయిల్

ABN , First Publish Date - 2021-11-23T00:21:27+05:30 IST

ఆదివారం సాయాని ఘోష్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ పేర్కొంది. పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు..

టీఎంసీ యువ నేత సాయని ఘోష్‌కి బెయిల్

అగర్తలా: త్రిపుర తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్‌ సాయని ఘోష్‌కి బెయిల్ లభించింది. బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన ఆమెకు సోమవారం త్రిపుర కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం త్రిపురలో జరిగిన ర్యాలీలో బీజేపీ కార్యకర్తలపై సాయని దాడికి పాల్పడ్డారని ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వాస్తవానికి దీనికి ముందు బీజేపీ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసుల ఎదుటే తమపై కర్రలతో దాడి చేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు.


అమిత్ షా కార్యాలయం ఎదుట టీఎంసీ నేతల నిరసన



కాగా, ఆదివారం సాయాని ఘోష్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ పేర్కొంది. పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు అగర్తల ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆమె ఇంటరాగేషన్ కోసం లోపలికి వెళ్లిన తర్వాత హెల్మెట్లు ధరించిన 25 మంది బీజేపీ కార్యకర్తలు చేతుల్లో కర్రలతో అక్కడికి చేరుకుని తమపై కార్యకర్తలపై దాడిచేసినట్టు టీఎంసీ ఆరోపించింది.

Updated Date - 2021-11-23T00:21:27+05:30 IST