Anubrata Mondal: కోల్‌కతా ఆసుపత్రిలో టీఎంసీ నేతకు చేదు అనుభవం.. చోర్ చోర్ అంటూ నినాదాలు

ABN , First Publish Date - 2022-08-09T00:54:05+05:30 IST

టీఎంసీ నేత, భీర్భుం జిల్లా పార్టీ చీఫ్ అనుబ్రత మండల్‌‌ (Anubrata Mondal)కు కోల్‌కతా ఆసుపత్రిలో చేదు అనుభవం

Anubrata Mondal: కోల్‌కతా ఆసుపత్రిలో టీఎంసీ నేతకు చేదు అనుభవం.. చోర్ చోర్ అంటూ నినాదాలు

కోల్‌కతా: టీఎంసీ నేత, భీర్భుం జిల్లా పార్టీ చీఫ్ అనుబ్రత మండల్‌‌ (Anubrata Mondal)కు కోల్‌కతా ఆసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది. పశువుల అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు సీబీఐ ఈ నెల 5న సమన్లు జారీ చేసింది. సోమవారం లోపు తమ ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రి (SSKM Hospital)లో చేరారు. మండల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఏడుగురు వైద్యుల కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్య బృందం అనుబ్రత మండల్ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 


దీంతో ఆయనను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయనను చూసిన కొందరు ‘చోర్.. చోర్’ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సీబీఐ ఆయనను రెండుసార్లు ప్రశ్నించింది. పశువుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి బీర్భుం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీబీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మండల్ బాడీగార్డ్ సైగల్ హొసైన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 

Updated Date - 2022-08-09T00:54:05+05:30 IST