ఉద్యోగ సంఘాలను ఎవరూ నిర్వీర్యం చేయలేరు

ABN , First Publish Date - 2021-03-06T05:10:56+05:30 IST

‘పీఆర్‌సీ విషయంలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల మధ్య అనైఖ్యత వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన ఉద్యోగ సంఘాలను ఎవరూ నిర్వీర్యం చేయలేరు’ అని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌ అన్నారు.

ఉద్యోగ సంఘాలను ఎవరూ నిర్వీర్యం చేయలేరు
భద్రాద్రి రామాలయంలో టీఎన్‌జీవో నాయకులు

సంఘాల మధ్య అనైఖ్యత ఏర్పడినా సంఘటితం చేస్తాం

మేము ఎవరికి అనుకూలం కాదు,వ్యతిరేకం కాదు 

ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ సాధిస్తాం

రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌

భద్రాచలం, మార్చి 5 : ‘పీఆర్‌సీ విషయంలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల మధ్య అనైఖ్యత వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన ఉద్యోగ సంఘాలను ఎవరూ నిర్వీర్యం చేయలేరు’ అని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌ అన్నారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘాల మధ్య అనైఖ్యత ఏర్పడినా వారందరినీ సంఘటితం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెరుగైన పీఆర్‌సీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ సంఘం ఎవరికీ అనుకూలం కాదని, అలాగని వ్యతిరేకమూ కాదని స్పష్టం చేశారు. ఏ సమస్య అయినా వివిధ మార్గాల్లో పోరాడి సాధించుకోవాలని కాని పరిమితులు దాటి వ్యవహరిస్తే ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నారు. కొన్ని సమయాల్లో పోరాటాల కోసం ముందడుగులు, మరికొన్ని సమయాల్లో వెనుకడుగు వేసినా ప్రభుత్వాన్ని మెప్పించి డిమాండ్లను సాధించుకోవడం జరుగుతుందన్నారు. ఏది చేసినా ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తామన్నారు. ఆయన వెంట టీఎన్‌జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు అమరనేని రామారావు, ప్రధాన కార్యదర్శి భార్గవ చైతన్య, బుల్లెట్‌ శ్రీనివాసరావు, భద్రాచలం డివిజన్‌ నాయకులు డెక్కా నరసింహారావు, బాలకృష్ణ, నాగభూషణం, నర్సింహారావు, శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:10:56+05:30 IST