డీఎంహెచ్‌వోకు టీఎన్జీవో హెల్త్‌ ఫోరం అభినందనలు

ABN , First Publish Date - 2021-03-07T04:55:49+05:30 IST

సంగారెడ్డి జిల్లా నూతన డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ సునీల్‌కుమార్‌ను టీఎన్జీవో హెల్త్‌ ఫోరం నాయకులు సంగారెడ్డిలోని స్థానిక జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

డీఎంహెచ్‌వోకు టీఎన్జీవో హెల్త్‌ ఫోరం అభినందనలు
డీఎంహెచ్‌వో సునీల్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 6 : సంగారెడ్డి జిల్లా నూతన డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ సునీల్‌కుమార్‌ను టీఎన్జీవో హెల్త్‌ ఫోరం నాయకులు సంగారెడ్డిలోని స్థానిక జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి, జిల్లా హెల్త్‌ ఫోరం అధ్యక్షుడు ప్రసన్న, నారాయణఖేడ్‌ డివిజన్‌ అధ్యక్షుడు జెట్ల భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, దేవిపుత్ర, డీఐవో శశాంత్‌ పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునీల్‌కుమార్‌ హెచ్చరించారు. సంగారెడ్డిలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. 

Updated Date - 2021-03-07T04:55:49+05:30 IST