ఎస్సీ ఎస్టీ కేసుల నిందితులను అరెస్టు చేయండి : డీఐజీ

ABN , First Publish Date - 2020-09-23T10:06:10+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల్లో నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవి మోహనరావు ఆదేశించారు.

ఎస్సీ ఎస్టీ కేసుల నిందితులను అరెస్టు చేయండి : డీఐజీ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 22 : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల్లో నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవి మోహనరావు ఆదేశించారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలతో, సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారులతోనూ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.


కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశి ంచారు. సీడీ ఫైల్స్‌ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. త్వరితగతిన ఛార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయాలన్నారు. కాన్ఫరెన్సులో తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఏలియా సాగర్‌, సీసీఎస్‌ డీఎస్పీ వి.భీమారావు, రాజ మహేంద్రవరం ఏటీవీ రవికుమార్‌, జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T10:06:10+05:30 IST