విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-06T04:41:00+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయ కులు, కార్యకర్తలు మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
వినతి పత్రం అందిస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

 శ్లాబు పెచ్చులూడుతుంటే కొత్త రంగులా!

డీఈవో కార్యాలయం ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ధర్నా

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 5: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌   నాయ కులు, కార్యకర్తలు మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అమ్రుల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వం ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు చేయకుండా ప్రమాదం పొంచి ఉన్న భవనాల్లోనే తరగతులను నిర్వ హిస్తూ విద్యార్థులను ప్రమాదకర పరిస్థితుల్లో  నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాకానుక పేరుతో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న బ్యాగులు, బూట్లలో ఏ మాత్రం నాణ్యత లేదని విమర్శించారు. ఇచ్చిన కొన్ని రోజులకే బ్యాగులు చిరిగి పోతున్నాయని, జిప్పులు ఊడిపోతున్నాయన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడూ లేని విధంగా విద్యావస్థ పూర్తిగా నాశ నమైందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే భారీ ఎత్తున నిసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్ర మంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్ధులు 

Updated Date - 2022-07-06T04:41:00+05:30 IST