ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:17:16+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నిలువరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలి
డీఈవో కార్యాలయం వద్ద నాయకుల నినాదాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 6 : నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నిలువరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఏలూరు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపులేని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు వివరాలను నోటీసుబోర్డులో ప్రదర్శించాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఈవో గంగాభవానికి వినతిపత్రాన్ని అందజేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు వేగి సిద్దు, పవన్‌, జగత్‌, మహేష్‌, సాయిరామ్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:17:16+05:30 IST