రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ: టీఎన్ఎస్ఎఫ్

ABN , First Publish Date - 2021-09-18T23:06:10+05:30 IST

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ మారిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ: టీఎన్ఎస్ఎఫ్

విశాఖ: రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ మారిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ ఆరోపించారు. ఏయూలో జరుగుతున్న అవినీతి, కక్ష సాధింపుపై మంత్రిని ఆదిమూలపు సురేష్ ను కలిసేందుకు వచ్చామని ఆయన తెలిపారు. మంత్రిని కలువకుండా తమను అడ్డగించారన్నారు.  ఏయూ వీసీని పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఏయూ ప్రతిష్టను కాపాడే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రణవ్ గోపాల్  కోరారు. 




ఉన్నత విద్యామండలి ప్రణాళికాబోర్డు సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూలో జరుగుతున్న అవకతవకలపై మంత్రికి ఫిర్యాదు చేసేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ వచ్చారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సమావేశం జరిగే ప్రదేశం బయట ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సమావేశం జరిగే ప్రదేశం బయట టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేసారు. 

Updated Date - 2021-09-18T23:06:10+05:30 IST