పోషణమాసం లక్ష్యాన్ని సాధించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:13:58+05:30 IST

పోషణమాస లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధి కారి జ్యోతి పద్మ అన్నారు.

పోషణమాసం లక్ష్యాన్ని సాధించాలి
సూర్యాపేటలో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ

జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ 

సూర్యాపేటరూరల్‌, సెప్టెంబరు 23: పోషణమాస లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధి కారి జ్యోతి పద్మ అన్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని  ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన  పోషణ మాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నా రుల ఎత్తును కొలిచి, బరువును తూచి బలహీనంగా ఉన్నవారికి అంగన్‌ వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారం అందించాలన్నారు.  పోషణ లోపరహిత జిల్లా కోసం అందరూ కృషి చేయాలన్నారు.  క్షేత్రస్థాయిలో సిబ్బంది అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం లక్ష్యాన్ని  చేరుకోవాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన లేక పిల్లల ఎత్తు, బరువు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడంతో సాధారణస్థితిలో ఉన్న పిల్లలకు కూడా పోషణలోపం ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయన్నారు. ఇలాంటి తప్పిదాలు మరోసారి జరిగితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల సేవలను విస్తరించి పోషణలోప నివారణకు చర్యలు తీసుకుంటామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడీ భిక్షం, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సనాయుడు, సీడీపీవో రూప, పి.సంపత్‌, అన్నపూర్ణ, నగిత, ఉపేంద్ర, వీరమ్మ, కైరు న్నీసా,  అంగన్‌వాడీ టీచర్లు,  పోషణ అభియాన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

హుజూర్‌నగర్‌: మహిళా సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ అన్నారు. కరక్కా యలగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వ హించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కీత జయమ్మ ధనమూర్తి, కల్పన, లక్ష్మీనారాయణ, వీరబాబు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి

మఠంపల్లి: ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని మఠంపల్లి సర్పంచ్‌ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మఠంపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం–6లో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జాల కిరణ్‌యాదవ్‌, ఎంపీటీసీ బానోతు సైదమ్మ, నాగరాజు, సురేష్‌, అంగన్‌ వాడీ కార్యకర్తలు రమణ, రాములమ్మ, వీరజానకి, కృష్ణవేణి, ధనమ్మ, గోవిందమ్మ, భూదేవీ, జ్యోతి, లింగమ్మ పాల్గొన్నారు.

చిలుకూరు:మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–4లో సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ సిరికొండ కవిత  పాల్గొన్నారు. 

మేళ్లచెర్వు : కోదాడ ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయంలో 41మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.  ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వరరావు సొంత ఖర్చులతో గర్భిణులకు చీర, సారె, పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేయడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు రూ.10వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇసాక్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ దామోదర్‌రావు, వైస్‌ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి విజయచంద్రిక, టీచర్లు ప్రియాంక, శ్రీదేవి పాల్గొన్నారు.

మఠంపల్లి: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–6లో నిర్వహించిన గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్ర మంలో   మఠంపల్లి సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడి, ఉపసర్పంచ్‌ జాల కిరణ్‌ యాదవ్‌, ఎంపీటీసీ బానోతు సైదమ్మ, నాగరాజు పాల్గొన్నారు.





Updated Date - 2022-09-24T06:13:58+05:30 IST