పెళ్లి పత్రికలు పంచుతున్న యువతిపై సామూహిక అత్యాచారం.. అంతటితో ఆగక ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారంటే..

ABN , First Publish Date - 2022-05-22T05:48:04+05:30 IST

మూడు రోజుల్లో ఉన్న తన పెళ్లికి సంబంధించి కార్డులు పంచడం కోసం వెళ్లిందా యువతి. ఆ సమయంలో అదే ఊరికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం స్థానికంగా ఉన్న ఒక నేత దగ్గరకు పంపారు...

పెళ్లి పత్రికలు పంచుతున్న యువతిపై సామూహిక అత్యాచారం.. అంతటితో ఆగక ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారంటే..

మూడు రోజుల్లో ఉన్న తన పెళ్లికి సంబంధించి కార్డులు పంచడం కోసం వెళ్లిందా యువతి. ఆ సమయంలో అదే ఊరికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం స్థానికంగా ఉన్న ఒక నేత దగ్గరకు పంపారు. కొన్ని రోజులపాటు ఆమెను తన వద్దనే ఉంచుకున్న సందరు నేత.. తర్వాత ఆమెను పక్క రాష్ట్రంలో అమ్మేశాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. 


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీ జిల్లాకు చెందిన ఒక యువతికి గత నెల 21న పెళ్లి జరగాల్సి ఉంది. అదే నెల 18న పెళ్లి కార్డులు పంచడానికి ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఊరికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు తమ వద్దే ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా బలాత్కరించారు. తర్వాత ఒక స్థానిక రాజకీయ వేత్త వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా బాధితురాలి కష్టాన్ని తీర్చకుండా తన వద్ద కొన్ని రోజులు ఉంచుకున్నాడు. ఆపై మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని ఒక వ్యక్తికి అమ్మేశారు. 


అక్కడ తనను బలవంతంగా అతనితో ఉంచారు. అయితే ఆ సమయంలోనే ఎలాగో తన తండ్రిని కాంటాక్ట్ చేసిన బాధితురాలు తన కష్టాన్ని చెప్పుకుంది. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆమెను కాపాడారు. తండ్రికి అప్పగించారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తండ్రీకూతుళ్లు కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం కావాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-22T05:48:04+05:30 IST