బ్లాక్‌హెడ్స్‌ పోవాలంటే...

ABN , First Publish Date - 2021-09-13T05:35:37+05:30 IST

బ్లాక్‌ హెడ్స్‌ ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొత్తిమీర, పసుపుతో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని అంటున్నారు సౌందర్యనిపుణులు...

బ్లాక్‌హెడ్స్‌ పోవాలంటే...

బ్లాక్‌ హెడ్స్‌ ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొత్తిమీర, పసుపుతో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని అంటున్నారు సౌందర్యనిపుణులు. ఈ ప్యాక్‌ని ఎలా తయారుచేసుకోవాలంటే....

కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి రెండు టీస్పూన్ల పసుపు వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్టును రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య సులభంగా దూరమవుతుంది.

Updated Date - 2021-09-13T05:35:37+05:30 IST