జుట్టు పెరుగుదల బాగుండాలంటే...

ABN , First Publish Date - 2021-07-12T06:43:50+05:30 IST

ప్రోటీన్‌ పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలి. కోడిగుడ్లు, పాలు, పనీర్‌, పెరుగు, చికెన్‌, క్వినోవా వంటివి ఎక్కువగా తినాలి.

జుట్టు పెరుగుదల బాగుండాలంటే...

ప్రోటీన్‌ పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలి. కోడిగుడ్లు, పాలు, పనీర్‌, పెరుగు, చికెన్‌, క్వినోవా వంటివి ఎక్కువగా తినాలి.


జుట్టు బాగా పెరగాలంటే బయోటిన్‌ అవసరం. ధాన్యాలలో బయోటిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. బాదంపలుకులు, వాల్‌నట్స్‌, క్యాలిఫ్లవర్‌, క్యారట్‌ తీసుకోవడం ద్వారా కూడా బయోటిన్‌ దొరుకుతుంది. 


ఐరన్‌ లోపం ఉంటే ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. అది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు ఫెర్రిటిన్‌ అనే ప్రోటీన్‌ అవసరం. ఈ ప్రోటీన్‌ లోపం ఏర్పడితే జుట్టు పెరుగుదల తగ్గిపోతుంది. మాంసం, కోడిగుడ్లు, ఆకుకూరలు, జామకాయలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్‌ లభించేలా చూసుకోవచ్చు.


మాడు పొడిబారినట్టుగా ఉంటే జుట్టు పెరుగుదల బాగా లేదని అర్థం. అలాంటప్పుడు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా లభించే చేపలు, అవిసెలు, వాల్‌నట్స్‌ వంటివి ఎక్కువ తీసుకోవాలి. జుట్టు ఎదుగుదల బాగుండటానికి ఇవి ఉపయోగపడతాయి.


జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే తగినంత జింక్‌ అవసరం. పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశనగలు, తృణధాన్యాలు, చిక్కుడుగింజలు తీసుకోవడం  ద్వారా శరీరానికి అవసరమైన జింక్‌ లభించేలా చూసుకోవచ్చు.

Updated Date - 2021-07-12T06:43:50+05:30 IST