ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లకు నియామకపత్రాల అందజేత

ABN , First Publish Date - 2021-02-28T04:02:22+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థలో 13 మంది కాంట్రాక్టు పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌లకు నియామక పత్రాలు అందజేశారు.

ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లకు నియామకపత్రాల అందజేత
నియామకపు పత్రం అందిస్తున్న డీఎంహెచ్‌వో

నెల్లూరు(వైద్యం)ఫిబ్రవరి 27 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి శనివారం  డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థలో  13 మంది కాంట్రాక్టు పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌లకు నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 13 ఖాళీలకుగాను35 మంది ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23 మంది అర్హత సాధించగా 13 మందిని నిబంధనల ప్రకారం ఎంపిక చేసినట్టు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్‌ డాక్టర్‌ మంజులమ్మ తెలిపారు.

Updated Date - 2021-02-28T04:02:22+05:30 IST