చర్మం తాజాగా ఉండాలంటే...

ABN , First Publish Date - 2022-09-03T19:49:50+05:30 IST

చర్మ తత్వాన్ని బట్టి సౌందర్య చికిత్సలను ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా కాంబినేషన్‌ స్కిన్‌ కలిగిన వాళ్లు చర్మ తత్వానికి సరిపడే ప్యాక్స్‌ ఎంచుకోవాలి.

చర్మం తాజాగా ఉండాలంటే...

చర్మ తత్వాన్ని బట్టి సౌందర్య చికిత్సలను ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా కాంబినేషన్‌ స్కిన్‌ కలిగిన వాళ్లు చర్మ తత్వానికి సరిపడే ప్యాక్స్‌ ఎంచుకోవాలి.


తేనె, రోజ్‌ వాటర్‌ ప్యాక్‌

  • తేనె, పెరుగు, రోజ్‌ వాటర్‌ సమపాళ్లలో కలుపుకోవాలి.
  • ముఖం మీద పూసుకోవాలి.
  • 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
  • చల్లని నీళ్లతో కడిగేయాలి.

ఉపయోగాలు: తేనె, పెరుగు రెండూ చర్మాన్ని చల్లబరుస్తాయి. పొడిని పారదోలి చార్మనికి తేమను అందిస్తాయి. ఈ ప్యాక్‌తో చర్మం తాజాగా మారుతుంది. రోజ్‌వాటర్‌ చర్మం జిడ్డుగా మారకుండా నియంత్రిస్తుంది. 


ఓట్స్‌, బాదం ప్యాక్‌!

  • పది బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
  • మరుసటి ఉదయం ముద్దలా నూరుకోవాలి.
  • ఈ ముద్దకు ఒక చెంచా ఓట్స్‌, ఒక చెంచా తేనె, పెరుగు కలపాలి.
  • అన్నీ కలిపి ముఖం మీద పూసుకోవాలి.
  • 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. 
  • చల్లని నీళ్లతో కడిగేయాలి.

ఉపయోగాలు: ఓట్లు చర్మం మీద పేరుకున్న అదనపు జిడ్డును తొలగిస్తాయి. బాదం చర్మానికి తేమను అందిస్తుంది.

Updated Date - 2022-09-03T19:49:50+05:30 IST