దేశం, ధర్మం కోసం పోరాడితే ఆస్తులెందుకు?

ABN , First Publish Date - 2022-05-28T05:55:42+05:30 IST

డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానం టూ చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌కు బీఎండబ్ల్యు కార్లు, బీనామీల పేరిట ఆస్తులెందుకు అని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్య నారాయణ ప్రశ్నించారు.

దేశం, ధర్మం కోసం పోరాడితే ఆస్తులెందుకు?
సమావేశంలో మాట్లాడుతున్న కవ్వంపల్లి సత్యనారాయణ

 డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ


కరీంనగర్‌ అర్బన్‌, మే 27: దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానం టూ చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌కు బీఎండబ్ల్యు కార్లు, బీనామీల పేరిట ఆస్తులెందుకు అని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్య నారాయణ ప్రశ్నించారు. డీసీసీ కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ భార్య నగలు అమ్మి పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసిన సంజయ్‌ తన కొడుకుకు బీఎండబ్ల్యు కారు కొనిచ్చే స్థోమత ఎక్కడి నుంచి వచ్చిందనేది కరీంనగర్‌ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులపై, బినామీల పేరిట ఆస్తులు లేవని, గ్రానైట్‌, గుట్కా మాఫియా తో ఎటువంటి సంబంధాలు లేవని మహాలక్ష్మి గుడి లో ప్రమాణం చేయగలవా? అని ప్రశ్నించారు. ఏక్తాయాత్రలో సంజయ్‌ వ్యాఖ్యలు హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ ధర్మ రక్షకుడిగా చెప్పుకుంటున్న ఎంపీ సంజయ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని వేముల వాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధు లు తెచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు.  కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం నేడు పలు రాష్ట్రాలకు విస్తరించడం వెనక ఏ చీకటి శక్తి ఉందో, ఆ పార్టీకి ఆర్థికవనరులు ఎవరు సమ కూరుస్తున్నారో అందరికీ తెలుసన్నారు. బీజేపీ, ఎం ఐఎం పార్టీల మధ్య ఉన్న రహస్య సంబంధం ఏమిటనేది త్వరలోనే ప్రజలు గుర్తిస్తారన్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని, ప్రతి సంవ త్సరం కోటి ఉద్యోగాలు ఇస్తామని  హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశార న్నారు. దేశ సంపదలో భాగమైన ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచు తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా దీని గురించి సంజయ్‌ ఒక్కమాట మాట్లాడరని విమ ర్శించారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు క్యూలైన్లలోనే మరణించారన్నారు. 

గాంధీని చంపిన గాడ్సేను తమ దేవుడిగా చెప్పు కుంటున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి దొంగ దేశ భక్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ దేశ పౌరులేనని, వారం దరూ కలిసి మెలసి ఉండాలనే కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిననాటి నుంచి ఒకే సిద్ధాంతంతో పని చేస్తోందన్నారు. మత విధ్వేషాలు సృష్టించి దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్‌ కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సమా వేశంలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్‌, రహమత్‌ హుస్సేన్‌, సమ ద్‌నవాబ్‌, పులి ఆంజనేయులుగౌడ్‌, ఎండీ తాజ్‌, బొబ్బిలి విక్టర్‌, విద్యా సాగర్‌, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:55:42+05:30 IST