Viral Video: ఈ కుర్రాడి వయసు 23ఏళ్లే కానీ మామూలోడు కాదు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-10-04T01:30:18+05:30 IST

ఫైన పోలీసు గెటప్‌లో కనిపిస్తున్న ఈ కుర్రాడి వయసు ప్రస్తుతం 23ఏళ్లే. కానీ బరువు మాత్రం.. 180 కిలోలు. బరువు విషయాన్ని కొద్ది సేపు పక్కన పెడితే.. ఈ కుర్రాడు మామూలు ప్లాన్ వేయలేదు. ఏకంగా పోలీసు డ్రెస్‌ను

Viral Video: ఈ కుర్రాడి వయసు 23ఏళ్లే కానీ మామూలోడు కాదు.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ఫైన పోలీసు గెటప్‌లో కనిపిస్తున్న ఈ కుర్రాడి వయసు ప్రస్తుతం 23ఏళ్లే. కానీ బరువు మాత్రం.. 180 కిలోలు. బరువు విషయాన్ని కొద్ది సేపు పక్కన పెడితే.. ఈ కుర్రాడు మామూలు ప్లాన్ వేయలేదు. ఏకంగా పోలీసు డ్రెస్‌ను ధరించి హల్‌చల్ చేశాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం ఇతడు చెప్పిన మాటలు విని.. అధికారులు షాకయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఈ యువకుడి పేరు ముఖేష్ యాదవ్. ఇన్స్పెక్టర్ గెటప్ ధరించి గత కొద్దికాలంగా హైవేపై హల్ చల్ చేస్తున్నాడు. వాహనాలను ఆపుతూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే.. అతడి వైఖరిపట్ల అనుమానం వ్యక్తం చేసిన కొందరు ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్రణాళికతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. ఇన్స్పెక్టర్ గెటప్ ధరించడానికి గల కారణాలపై అతడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన ఆ యువకుడు.. తన వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ఫీజు తప్పించుకోవడానికి పోలీస్ గెటప్ ధరించినట్టు వెల్లడించాడు. అది విని అధికారులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. కాగా.. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. యువకుడిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. 




Updated Date - 2022-10-04T01:30:18+05:30 IST