బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పొత్తు: లెఫ్ట్ ఫ్రంట్

ABN , First Publish Date - 2021-01-17T18:43:25+05:30 IST

2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. వాస్తవానికి కాంగ్రెస్‌కు సీట్లు తక్కువగా కేటాయించినప్పటికీ లెఫ్ట్ పార్టీల కంటే ఎక్కువగా 44 సీట్లు గెలుచుకుంది. 200 పైగా స్థానాల్లో పోటీ చేసిన

బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పొత్తు: లెఫ్ట్ ఫ్రంట్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను మతతత్వ శక్తుల నుంచి కాపాడాలని లెఫ్ట్ ఫ్రంట్ చైర్‌పర్సన్ బిమన్ బోస్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌తో చేతులు కలపబోతున్నట్లు ఆయన ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రస్‌ పార్టీలకు వ్యతిరేకంగా బెంగాల్ ఎన్నికల్లోకి దిగబోతున్నట్లు తెలిపారు. బెంగాల్‌లో టీఎంసీ గూండా రాజకీయాలకు పాల్పడుతుంటే బీజేపీ మతం పేరుతలో అల్లర్లకు ప్రయత్నిస్తోందని, ఈ రెండింటినీ నిలువరించాలని బోస్ పేర్కొన్నారు.


ఆదివారం బిమన్ బోస్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ‘‘బెంగాల్‌ను మతతత్వ శక్తుల నుంచి కాపాడాలి. గూండా రాజకీయాల నుంచి కాపాడాలి. బీజేపీకి టీఎంసీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోరు చేయడానికి సిద్ధమయ్యాం. కాంగ్రెస్‌తో మాకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. సీట్ల పంపకాలపై మా మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చా జరగలేదు. దాని గురించి త్వరలోనే చర్చలు జరుగుతాయి. సర్ధుబాటు కంటే ముందు బీజేపీ, టీఎంసీలని నిలువరించడమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లబోతున్నాం’’ అని అన్నారు.


2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. వాస్తవానికి కాంగ్రెస్‌కు సీట్లు తక్కువగా కేటాయించినప్పటికీ లెఫ్ట్ పార్టీల కంటే ఎక్కువగా 44 సీట్లు గెలుచుకుంది. 200 పైగా స్థానాల్లో పోటీ చేసిన లెఫ్ట్ పార్టీలు కేవలం 40 స్థానాలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఈ సారి సీట్ల పంపకాల్లో సగం స్థానాలను డిమాండ్ చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-01-17T18:43:25+05:30 IST