నిద్ర పట్టాలంటే...

ABN , First Publish Date - 2021-01-23T05:30:00+05:30 IST

నిద్ర లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. అందుకే కంటినిండా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

నిద్ర పట్టాలంటే...

నిద్ర లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. అందుకే కంటినిండా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు.


ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.

పగటిపూట నిద్రపోకూడదు. ఒకవేళ ఆ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర ఆలస్యంగా పడుతుంది. దాంతో రోజువారీ టైమ్‌టేబుల్‌ తప్పి నిద్రలేమితో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. 

రాత్రి సమయంలో కాఫీ, టీలు మానేయాలి. ఇవి తాగితే తొందరగా నిద్ర పట్టదు. పడుకోబోయేముందు గోరువెచ్చటి పాలు తాగితే త్వరగా నిద్ర వస్తుంది.

పడుకునే ముందు ఇతర పనుల గురించి ఆలోచించకూడదు. దానివల్ల నిద్రపట్టక ఉదయాన సమయానికి లేవలేరు. పనులు కూడా ఓపిగ్గా, హుషారుగా చేసుకోలేరు. 

పడుకునే ముందు మనసుకు నచ్చిన విషయాలు ఆలోచించుకుంటే పీడకలలు రావు. నిద్రాభంగం కాదు. 

నచ్చిన పాటలు వినడం, నచ్చిన పుస్తకాలు చదవడం వల్ల రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. 

Updated Date - 2021-01-23T05:30:00+05:30 IST