నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం : టీఎనఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2021-07-25T05:44:10+05:30 IST

కర్నూల్లో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న టీటీసీ విద్యార్థి రమేష్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎస్‌ఎఫ్‌ ప్రఽధాన కార్యదర్శి కేపీ సల్మానఖాన ఆరోపించారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలకు   ప్రభుత్వమే కారణం : టీఎనఎస్‌ఎఫ్‌


చిలమత్తూరు, జూలై 24: కర్నూల్లో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న టీటీసీ విద్యార్థి రమేష్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎస్‌ఎఫ్‌ ప్రఽధాన కార్యదర్శి కేపీ సల్మానఖాన ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో స్థానిక టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు సురేంద్రయాదవ్‌, సాయి, హర్ష, రవికుమార్‌ తదితరలతో కలిసి మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహనరెడ్డి అవలంభిస్తున్న విధానాలు విద్యార్థి, యువత, నిరుద్యోగు యువతకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. దాంతోనే కర్నూల్లో టీటీసి విద్యార్థి రమేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రమేష్‌ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావించి అతని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలన్నారు. దాంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రభుత్వం కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే వరకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పోరాటం  చేస్తూనే ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా యువతకు, విద్యార్థులకు మేలు జరిగేటట్లు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని యవకులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.


Updated Date - 2021-07-25T05:44:10+05:30 IST