ఐర్లాండ్‌ టూర్‌కు కోచ్‌గా లక్ష్మణ్‌ ?

Published: Thu, 19 May 2022 04:55:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌లో పర్యటించే టీమిండియాకు జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించే అవకాశముంది. ఈ టూర్‌లో భారత జట్టు రెండు టీ20 (జూన్‌ 26, 28)లు ఆడనుంది. ఈ పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ఐర్లాండ్‌ పంపనుంది. కారణం..సీనియర్‌ జట్టు ఏకైక టెస్ట్‌కోసం ఇంగ్లండ్‌లో ఉండనుంది. దాంతో హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ ఆ జట్టుతో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ  భావిస్తోంది. జూలై ఒకటి నుంచి జరిగే ఈ టెస్ట్‌ సన్నాహల్లో భాగంగా వచ్చేనెల 24 నుంచి 27 వరకు భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడనుంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.